అఘోరాగా కనిపించనున్న మంచు మనోజ్

  • వైవిధ్యభరితమైన చిత్రంగా 'అహం బ్రహ్మస్మి'
  • వచ్చేనెల 6వ తేదీన షూటింగ్ మొదలు 
  • ఐదు భాషల్లో ఒకే రోజున విడుదల
మంచు మనోజ్ కథానాయకుడిగా 'అహం బ్రహ్మస్మి' రూపొందనుంది. సొంత బ్యానర్ పై ఆయన నిర్మిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల 6వ తేదీన ప్రారంభం కానుంది. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమా, ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోరాగా కనిపించనున్నాడనేది తాజా వార్త. సాధారణంగా అఘోరాగా కనిపించడానికి హీరోలు అంతగా సాహసించరు. కానీ మూడేళ్ల విరామం తరువాత వస్తున్న మనోజ్ మాత్రం అఘోరాగా తెరపై కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన పాత్రను మలిచిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇంకా ఎలాంటి విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

Mnachu Manoj
Srikanth Reddy
Aham Brahmasmi Movie

More Telugu News